కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
సుస్వాగతం.
ఇది యెహోవాసాక్షులు వేర్వేరు భాషల్లో రూపొందించిన ప్రచురణల పరిశోధనా పరికరం.
ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, దయచేసి jw.orgచూడండి.
ప్రకటన
ఆన్‌లైన్‌ లైబ్రరీ అందుబాటులోకి వచ్చిన కొత్త భాష: Dendi
  • ఈ రోజు

శనివారం, ఆగస్టు 9

“ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను ఇక తన కోసం తాను జీవించకుండా, ప్రతీరోజు తన హింసాకొయ్యను మోస్తూ, నన్ను అనుసరిస్తూ ఉండాలి.”—లూకా 9:23.

నా అనుకునేవాళ్లు మిమ్మల్ని వ్యతిరేకించి ఉండవచ్చు, లేదా దేవుని రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వడానికి బాగా డబ్బు సంపాదించే అవకాశాన్ని మీరు వదులుకొని ఉండవచ్చు. (మత్త. 6:33) అలాగైతే, యెహోవా మీద నమ్మకంతో మీరు చేసిన ఆ పనుల్ని ఆయన గమనించడు అంటారా? (హెబ్రీ. 6:10) యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలు నిజమని మీరు రుచి చూసుంటారు: “నా కోసం, మంచివార్త కోసం ఇల్లును గానీ, అన్నదమ్ముల్ని గానీ, అక్కచెల్లెళ్లను గానీ, అమ్మను గానీ, నాన్నను గానీ, పిల్లల్ని గానీ, భూముల్ని గానీ వదులుకున్నవాళ్లు ఇప్పుడు 100 రెట్లు ఎక్కువగా ఇళ్లను, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్లను, తల్లుల్ని, పిల్లల్ని, భూముల్ని, వాటితోపాటు హింసల్ని పొందుతారు; అలాగే రానున్న వ్యవస్థలో శాశ్వత జీవితాన్ని పొందుతారు.” (మార్కు 10:29, 30) నిజానికి, మనం పొందిన దీవెనలు సముద్రమంతైతే, మనం చేసిన త్యాగాలు అందులో నీటిబొట్టంత.—కీర్త. 37:4. w24.03 9 ¶5

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025

ఆదివారం, ఆగస్టు 10

“నిజమైన స్నేహితుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు, కష్టకాలంలో అతను సహోదరుడిలా ఉంటాడు.”—సామె. 17:17.

యూదయలో గొప్ప కరువు వచ్చినప్పుడు, అంతియొకయలో ఉన్న సంఘంలోని బ్రదర్స్‌, సిస్టర్స్‌ “ఒక్కొక్కరు తాము ఇవ్వగలిగిన దాన్నిబట్టి, యూదయలో ఉన్న సహోదరులకు సహాయం పంపించాలని నిశ్చయించుకున్నారు.” (అపొ. 11:27-30) కరువు బారినపడిన ఆ బ్రదర్స్‌, సిస్టర్స్‌ దూరంలో ఉన్నాసరే, అంతియొకయలో ఉన్న క్రైస్తవులు మాత్రం వాళ్లకు సహాయం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. (1 యోహా. 3:17, 18) ఈ రోజుల్లో మనం కూడా విపత్తు బారినపడిన మన బ్రదర్స్‌, సిస్టర్స్‌ మీద కనికరం చూపించవచ్చు. మనం సహాయం చేయడానికి వెంటనే ముందుండొచ్చు. బహుశా సహాయక చర్యల్లో పని చేయగలమా అని పెద్దల్ని అడగొచ్చు, ప్రపంచవ్యాప్త పనికి విరాళం ఇవ్వొచ్చు లేదా విపత్తు బారినపడిన వాళ్లకోసం ప్రార్థించవచ్చు. మన బ్రదర్స్‌, సిస్టర్స్‌కి రోజువారీ అవసరాల్ని తీర్చుకోవడానికి కూడా మన సహాయం అవసరమవ్వచ్చు. మన రాజు యేసుక్రీస్తు తీర్పుతీర్చడానికి వచ్చినప్పుడు మనం ఇతరుల మీద కనికరం చూపించడం గమనించి, “రాజ్యానికి వారసులు అవ్వండి” అని మనల్ని ఆహ్వానిస్తాడు.—మత్త. 25:34-40. w23.07 4 ¶9-10; 6 ¶12

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025

సోమవారం, ఆగస్టు 11

“మీరు పట్టుబట్టే ప్రజలు కాదని అందరికీ తెలియనివ్వండి.”—ఫిలి. 4:5.

యేసు యెహోవాలా సహేతుకత చూపించాడు. ఆయన “ఇశ్రాయేలు ప్రజల్లో తప్పిపోయిన గొర్రెల్లాంటి” వాళ్లకు ప్రకటించడానికి ఈ భూమ్మీదికి వచ్చాడు. కానీ ఆ నియామకాన్ని చేస్తున్నప్పుడు యేసు సహేతుకత చూపించాడు. ఒక సందర్భంలో ఇశ్రాయేలీయురాలు కాని ఒక స్త్రీ, తన పాపకు చెడ్డదూత పట్టడం వల్ల “విపరీతంగా బాధపడుతోంది” అని చెప్పి, తనను బాగుచేయమని యేసును బ్రతిమిలాడింది. యేసు ఆమెపట్ల కనికరం చూపించి, ఆ పాపను బాగుచేశాడు. (మత్త. 15:21-28) ఇంకో ఉదాహరణ గమనించండి. యేసు తన పరిచర్య చేస్తున్నప్పుడు ఒక సందర్భంలో, ‘ఎవరైనా నన్ను తిరస్కరిస్తే, నేను కూడా అతన్ని తిరస్కరిస్తాను’ అన్నాడు. (మత్త. 10:33) కానీ పేతురు యేసు ఎవరో తెలీదని మూడుసార్లు ఆయన్ని తిరస్కరించాడు. మరి దానికి యేసు కూడా పేతురును తిరస్కరించాడా? లేదు. పేతురు చూపించిన పశ్చాత్తాపాన్ని, ఆయన విశ్వాసాన్ని యేసు చూశాడు. పునరుత్థానమైన తర్వాత యేసు పేతురుకు కనిపించి, తనను క్షమించానని, తనను ఇంకా ప్రేమిస్తున్నాడనే భరోసాను ఇచ్చాడు. (లూకా 24:33, 34) యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఇద్దరూ సహేతుకత చూపిస్తారు. మరి మన సంగతేంటి? మనం కూడా సహేతుకత చూపించాలని యెహోవా ఆశిస్తున్నాడు. w23.07 21 ¶6-7

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2025
సుస్వాగతం.
ఇది యెహోవాసాక్షులు వేర్వేరు భాషల్లో రూపొందించిన ప్రచురణల పరిశోధనా పరికరం.
ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, దయచేసి jw.orgచూడండి.
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి